మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం 'బాక్సర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాక్సర్‌గా తనని తాను మలచుకునేందుకు వరుణ్ తేజ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రియల్ బాక్సింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ నీరజ్ గోయత్ వద్ద వరుణ్ తేజ్ బాక్సింగ్‌లో మెలకువలు తెలుసుకుంటున్నాడు.
గతంలోనే రెండు నెలలు ఆంగ్ల బాక్సింగ్ ఛాంపియన్ టోనీ జెఫ్రీ వద్ద శిక్షణ తీసుకున్న వరుణ్ ప్రస్తుతం నీరజ్ గోయత్ వద్ద శిక్షణకు సిద్ధమయ్యాడు. వరల్డ్ బాక్సింగ్ ర్యాంకర్స్‌లో ఇండియా తరపున నీరజ్ ది బెస్ట్ ర్యాంకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి స్పెషలిస్ట్ వద్ద వరుణ్ తేజ్ మెలకువలు తెలుసుకోవడం విశేషం. ఏదో సినిమా కోసం అన్నట్లుగా కాకుండా, ప్యాషన్‌తో ఈ శిక్షణలో ఆరి తేరుతున్నాడట వరుణ్ తేజ్. 'గద్దల కొండ గణేష్' కోసం తన లుక్, మేకోవర్‌ని వరుణ్ ఏ విధంగా మలచుకున్నాడో తెలిసిన సంగతే. అలాగే ఇప్పుడు బాక్సర్ పాత్ర కోసం రియల్ బాక్సర్‌గా ట్రైనింగ్ తీసుకుంటుండడం విస్మయానికి గురి చేస్తోంది.
హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ లారెన్ స్టోవల్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్' సినిమాకి కొరియోగ్రఫీ అందించారాయన. అల్లు బాబీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.