'టాక్సీవాలా' ద‌ర్శ‌కుడితో నాని?

మరిన్ని వార్తలు

నాని కోసం కొత్త క‌థ‌లు పుడుతూనే ఉన్నాయి. వాటిలో ఒకొక్క‌టిగా సెట్ చేసుకుంటూ వెళ్తున్నాడు నేచురుల్ స్టార్‌. ప్ర‌స్తుతం 'వీ' సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఉగాదికి విడుద‌ల కానుంది. ఈలోగా మ‌రో సినిమాకి ఓకే చెప్పేశాడు నాని. నాని క‌థానాయ‌కుడిగా సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

 

టాక్సీవాలాతో ఆక‌ట్టుకున్న‌ రాహుల్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. క‌థ ఇప్ప‌టికే సిద్ద‌మైంది. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే.. 'వి' త‌ర‌వాత ఈ ప్రాజెక్టే ముందుకు వెళ్తుందా? లేదంటే.. మ‌ధ్య‌లో నాని మ‌రో సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS