'అక్కడ' ఆగిన కెమిస్ట్రీ.. 'ఇక్కడ' కంటిన్యూ కానుందన్నమాట.!

By Inkmantra - September 18, 2019 - 13:15 PM IST

మరిన్ని వార్తలు

కొన్ని క్లాస్టిక్స్‌ని టచ్‌ చేయాలంటే దమ్ముండాలి. అలాంటి సాహసం చేసే ముందు అన్ని లెక్కలూ పక్కాగా పాఠించాలి కూడా. తాజాగా 'వాల్మీకి' సినిమా కోసం అలనాటి మేటి పాట 'ఎల్లువొచ్చి గోదారమ్మా.. ఎల్లాకిల్లా పడ్డాదమ్మా..' పాటని రీ మిక్స్‌ చేశారు. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. ఆ గోల్డ్‌కి ఎలాంటి డ్యామేజ్‌ లేకుండా ఈ పాటను చిత్రీకరించారు హరీష్‌ శంకర్‌ అండ్‌ టీమ్‌. వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్దే జంట పాటకి హైలైట్‌ అయ్యింది. శోభన్‌బాబు, శ్రీదేవి పాత్రల్లో ఈ ఇద్దరూ న్యూ వెర్షన్‌లో జీవించేశారు. అందుకే ఈ పాట ప్రోమోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

 

ఎవ్వరూ వ్యతిరేకించలేదు. అందరూ సూపర్‌ అన్న ప్రశంసలే కురిపిస్తున్నారు. విజువల్‌ని కూడా ఏమాత్రం డిస్ట్రబ్‌ చేయకుండా, గోదారీ తీరాన, ఇత్తడి బిందెల సెట్టింగుల్లో కాస్ట్యూమ్‌ దగ్గర నుండీ, డాన్సింగ్‌ సైన్స్‌, అతిలోక సుందరి శ్రీదేవిగా పూజా హెగ్దే ఎక్స్‌ప్రెషన్స్‌ అన్నీ కరెక్ట్‌గా సెట్టయ్యేలా పూర్తిగా జాగ్రత్తలు తీసుకున్నారు. సిట్యువేషన్‌ డిమాండ్‌ చేయడంతోనే ఈ పాటని సినిమా కోసం తీసుకున్నారట. సినిమాలో ఈ సాంగ్‌ వచ్చే విధానం, ఫుల్‌ సాంగ్‌ వీడియో చూసి, ఆడియన్స్‌ ఖచ్చితంగా హ్యాపీ ఫీలవుతారని చిత్ర యూనిట్‌ చెబుతోంది.

 

'ముకుందా' సినిమా తర్వాత వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్దే జంట మరోసారి ఈ సినిమాతో ఆకట్టుకోనుంది. ఆ సినిమాలో ఈ ఇద్దరి మధ్య చూపుల కెమిస్ట్రీ తప్ప నో టచ్చింగ్‌ కెమిస్ట్రీ.. అయినా ఈ జంట చూపించిన రొమాంటిక్‌ ఇంపాక్ట్‌ అంతా ఇంతా కాదు.. క్లైమాక్స్‌లో హీరోయిన్‌ వచ్చి హీరోని హగ్‌ చేసుకునే సిట్యువేషన్‌కి ఇంకా కంటిన్యూషన్‌ ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. కానీ అక్కడితో శుభం కార్డ్‌ పడిపోతుంది. ఆ కంటిన్యూషన్‌ ఇప్పుడు 'వాల్మీకి'తో చూడొచ్చేమో చూడాలి మరి. ఈ నెల 20న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది 'వాల్మీకి'.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS