మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం కోసం రిస్కీ ఫైట్లు చేస్తున్నాడట. ఎంత రిస్క్ అయినా వెనుకాడడం లేదట. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రయోగాల డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
కాగా ఇటీవల షూట్ చేసిన ఓ రిస్కీ ఫైట్ సీన్ కోసం డైరెక్టర్ డూప్‌ని సూచించాడట. అయితే డూప్ అవసరం లేకుండానే నటిస్తానని వరుణ్ చెప్పడంతో చిత్ర యూనిట్ షాకైందట. అయినా ఇప్పుడు హీరోలు కమిట్‌మెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంతటి రిస్కీ షాట్స్‌నైనా సహజంగా రావాలనే ఆశిస్తున్నారు. అందుకోసం ఎంత కష్టాన్నైనా భరించేస్తున్నారు. అందులో భాగంగానే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మెగా ప్రిన్స్ కూడా అదే చేస్తున్నాడట. వరుణ్ కోసం చిత్ర యూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట.
సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తోందని ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు సంబంధించి, చిత్ర యూనిట్ ద్వారా అందుతున్న సమాచారమ్. బహుశా అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతోన్న తొలి సినిమా ఇదే కావచ్చు. ఈ సినిమాలో వరుణ్ సరసన అదితీరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఓ వైపు ఈ సినిమాలో నటిస్తూనే వరుణ్ తేజ్ మరోవైపు వెంకీతో 'ఎఫ్ 2' చిత్రంలో నటిస్తున్నాడు. అదేమో ప్రయోగాత్మక చిత్రమైతే, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా అందాల భామ మెహరీన్ నటిస్తోంది.