పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలకుగానూ పవన్‌కి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ హీరోలైన సాయి ధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్. వీరితో పాటు, పవన్‌కి వీరాభిమాని, భక్తుడు అయిన నితిన్ కూడా పవన్‌కి మద్దతుగా నిలిచాడు. శ్రీరెడ్డి, పవన్‌పై చేసిన ఆరోపణల దృష్ట్యా, 'ప్రతీ యాక్షన్‌కీ అపోజిట్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. అది త్వరలోనే వస్తుంది..' అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు.
అలాగే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మామయ్య పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా గతంలో పవన్ మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేశాడు. 'ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసే వచ్చాం, రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తారు. కానీ ఎవరేమన్నా పట్టించుకోవద్దు. మన దారికి అడ్డు తగిలేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాటిని అధిగమించి ముందుకు సాగాలి..' అని ఆ వీడియోలో గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ వీడియోని తాజాగా పోస్ట్ చేసి, తేజు మేనమామకి మద్దతుగా నిలిచాడు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా స్పందించాడు. 'హిపోక్రైట్స్ని పట్టించుకోవల్సిన అవసరం లేదు. అది వారి చేతకానితనాన్ని బయటపెడుతుంది. ఇతరుల్ని కించపరచడం చాలా తేలిక. అలా విమర్శించే ముందు తమని తాము ఒక్కసారి అద్దంలో చూసుకుంటే, వారి జుగుప్సాకరమైన చర్యలు బయట పడతాయి..' అని వరుణ్ ట్వీట్ చేశాడు.
శ్రీరెడ్డి ఇష్యూపై పవన్ 'పోలీసులనాశ్రయించడం వల్ల న్యాయం జరుగుతుంది తప్ప, ఇలా మీడియా ముందు కూర్చొని మాట్లాడితే ఉపయోగం ఉండదు..' అని స్పందించినందుకు గాను శ్రీరెడ్డి ఆయనపై రకరకాలుగా విరుచుకుపడుతోంది. ఆ కోవలోనే పవన్ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు.