తొలిప్రేమ చిత్రం ఘన విజయం సాధించటంతో మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక తన తదుపరి చిత్రం ఘాజి చిత్ర దర్శకుడైన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఇక ఈ చిత్రం కూడా ఘాజి వలే కొద్దిగా వైవిధ్యంగా ఉండే చిత్రమట. ఇది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి ఒక టైటిల్ ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఆ టైటిల్ ఏంటంటే - అహం బ్రహ్మాస్మీ.
దీన్ని బట్టి ఆ చిత్ర కథ ఎలా ఉండబోతోంది అన్నది మనం ఊహించవచ్చు. ఎందుకంటే రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొద్దిగా వైవిధ్యం ఉండే చిత్రాలని చేసే వరుణ్ తేజ్ అలాగే తన మొదటి చిత్రంతోనే అందరిని తన వైపుకి తిప్పేసుకున్న దర్శకుడు సంకల్ప్ రెడ్డి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ కథాంశం పైన అంచనాలు వేరే విధంగా ఉన్నాయి.
మరి ఈ టైటిల్ కి తగ్గట్టుగానే చిత్రం కూడా ఎంతటి భిన్నంగా ఉండబోతుంది అనేది ఇంకొన్ని రోజుల్లో తెలియనుంది.