కూల్ ఎంటర్‌టైనర్ 'ముకుందా'తో ఎంట్రీ ఇచ్చి తొలి విజయం అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్. అలాగే సెకండ్ మూవీ 'కంచె'తో డిఫరెంట్ జోనర్‌ని వెతికి పట్టుకుని మరో సారి విజయం సాధించాడు. మాస్‌ని టచ్ చేసి 'లోఫర్'తో ఢీలా పడ్డాడు. 'మిస్టర్' ఓకే అనిపించినా, సంతృప్తి పరచలేదు. దాంతో తన బలమేంటో, బలహీనత ఏంటో తెలుసుకున్నాడు కాబోలు 'ఫిదా'తో మళ్లీ అందర్నీ ఫిదా చేసేశాడు. ఇకపై లవ్ స్టోరీస్ వైపే తన ఆడుగులు కదపనున్నాడట వరుణ్. తాజాగా అట్లూరి వెంకీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఓ డిఫరెంట్ జోనర్ లవ్ స్టోరీ ఇది. 'ఫిదా'తో ఆంధ్రా, తెలంగాణా ఆడియన్స్‌నే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా దున్నేస్తున్నాడు మెగా రాకుమారుడు. అందుకే తనకి కలిసొచ్చిన జోనర్‌లోనే దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. గ్యాప్ తీసుకున్నా కానీ, ఆచి, తూచి కథల్ని ఎంచుకుంటానంటున్నాడు మనోడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమా సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తోంది. మంచి వసూళ్లు రాబడుతోంది. వరుణ్ కెరీర్ బెస్ట్ మూవీగా 'ఫిదా' అభివర్ణిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చాలా సాదా సీదాగా మొదలైన ఈ సినిమాతో వరుణ్ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. మలయాళ ముద్దుగుమ్మ సాయి పల్లవి ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, మంచి హిట్ కొట్టడమే కాకుండా, తన యాక్టింగ్‌కి తెలుగు ప్రేక్షకులందర్నీ తన వైపు ఆకర్షించేసింది.