చిత్ర పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. దీనికి ఒక రకంగా భీజం వేసింది తెలుగు చిత్రసీమేనే. రాజమౌళి 'బాహుబలి' పాన్ ఇండియా సినిమాకి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం తెలుగులోనే అరడజనుకు పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు రెడీ అవుతున్నాయి. లైగర్, సలార్, ఆదిపురుష్, ఆర్ఆర్ఆర్, ఇండియన్ 2, రాధేశ్యామ్ .. ఇలా వరుస ప్రాజెక్ట్లు సిద్ధంగా వున్నాయి. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఓ ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
ఇటివల ఓ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, వరుణ్ తేజ్ తో ఓ సినిమా కోసం చర్చలు జరిపింది. వరుణ్ కు స్టొరీలైన్ నచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా చేయాలనే ఆలోచన వుందట. రామ్ చరణ్ ఇదివరకు తుపాన్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమా పెద్దగా రాణించలేదు. కానీ ఇప్పుడు మార్కెట్, పరిస్థితులు మారాయి. పాన్ ఇండియా కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. రామ్ చరణ్ చేస్తున్న ఇండియన్ 2, ఆర్ఆర్ఆర్ రెండూ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నాడు. తర్వలోనే ఈ ప్రాజెక్ట్ కి సంభదించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ప్రస్తుతం ఘని, ఎఫ్ 3 సినిమాలతో బిజీగా వున్నాడు వరుణ్ తేజ్.