నానితో 'నిన్ను కోరి' సినిమాని తెరకెక్కించి హిట్ కొట్టాడు యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ. అయితే ఈ దర్శకుడి దృష్టి ఇప్పుడు మెగా హీరోపై పడిందట. మెగా రాకుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఓ కథని సిద్ధం చేశాడట శివ నిర్వాణ. అయితే ఈ కథకి 'ఫిదా'లో వరుణ్ తేజ్ నటించిన వరుణ్ క్యారెక్టర్‌కీ సంబంధం ఉందంటున్నాడు. అంటే 'ఫిదా'లో వరుణ్ క్యారెక్టర్‌కి కొనసాగింపుగా తన కొత్త సినిమాలో హీరో క్యారెక్టర్ ఉంటుందని శివ నిర్వాణ చెబుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కూల్ అండ్ రొమాంటిక్ స్టోరీ 'ఫిదా'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించింది ఈ సినిమా. ఈ సినిమాలో వరుణ్ క్యారెక్టర్ ప్రేయసి కోసం తపన పడే ఓ కుర్రాడి పాత్రలో కూల్ అండ్ హ్యాండ్సమ్ లుక్స్‌తో మెప్పించాడు వరున్ తేజ్. ఇదే క్యారెక్టర్ని బేస్ చేసుకుని వరుణ్ని హీరోగా దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ స్టోరీ ప్రిపేర్ చేశాడట. ఆ స్టోరీ విషయంలో వరుణ్ ఓకే అంటే సినిమాని పట్టాలెక్కించేస్తానంటున్నాడు డైరెక్టర్ శివ నిర్వాణ. ప్రస్తుతం ఈ స్టోరీ చర్చల దశలో ఉందట. మరో పక్క వరుణ్ ప్రస్తుతం 'తొలిప్రేమ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. తొలుత 'ముకుందా', 'కంచె' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్‌తో వచ్చిన వరుణ్ తేజ్‌కి ఇప్పుడు లవర్ బోయ్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేస్తున్న 'తొలిప్రేమ' సినిమా కూడా లవ్ కాన్సెప్టే. అయినా మనోడి బాడీ లాంగ్వేజ్ ఎలాంటి క్యారెక్టర్‌కైనా సూటయిపోతుంది. కటౌట్ చూసి కొన్ని కొన్ని అలా సెట్ అయిపోతాయి అంతే. మెగా రాకుమారుడా! మజాకానా!