గ్లామ్‌షాట్‌: ఆ భామ అందాలకు 'డబుల్‌' సెల్యూట్‌.!

మరిన్ని వార్తలు

పెళ్లికూతురులా బ్రైట్‌గా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.? అప్పుడెప్పుడో 'విజయదశమి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఆ తర్వాత 'బాణం', దగ్గరగా దూరంగా' తదితర చిత్రాల్లో నటించింది. కానీ, స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోలేకపోయింది. పోత పోసిన శిల్పంలా ఉన్న ఈ ముద్దుగుమ్మ పేరు వేదిక. ఈ మధ్య లారెన్స్‌ నటించిన హారర్‌ కామెడీ 'ముని' సిరీస్‌లో నాలుగోదిగా వచ్చిన 'కాంచన 3'లో హీరోయిన్‌గా నటించింది. 'ముని' తొలి సిరీస్‌లోనూ వేదికే హీరోయిన్‌.

 

కాగా మధ్యలో నటనకు చాలా గ్యాప్‌ తీసుకున్న వేదిక ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. వరుసగా సినిమాలు చేయాలనుకుంటోందట. ఆ దిశగా తనను తాను మరింత ప్రమోట్‌ చేసుకోవాలనుకుంటోందట. ఆ దిశగా సోషల్‌ మీడియాలో హాట్‌ యాంగిల్స్‌లో తనలోని గ్లామర్‌ని ప్రదర్శనకు పెట్టింది. గ్లామర్‌లో ఎలాంటి మొహమాటాల్లేని వేదిక తాజాగా క్యూట్‌ బ్రైడల్‌ వేర్‌లో హాట్‌ నావెల్‌ ఎక్స్‌పోజ్‌ చేస్తూ దర్శనమిచ్చింది. మెరూన్‌ కలర్‌ టాప్‌, క్రీమ్‌ కలర్‌ లెహెంగాలో వేదిక అందాలు కెవ్వుకేక పెట్టిస్తున్నాయి. వేదికను అలా చూస్తుంటే, ఎవరికైనా పిలిచి మరీ అవకాశమివ్వాలనిపించేయదూ.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS