బాలకృష్ణ గుణగణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలయ్య గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి. తను భోళా మనిషి. కాకపోతే.. ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తాడో చెప్పలేం తనకుకోపం కూడా ఎక్కువే. తన ముందున్న వాళ్లు, తనతో పనిచేసే వాళ్లు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే లేదంటే.. దబిడి దిబిడే. తన అసిస్టెంట్లపై బాలయ్య కోప్పడిన సందర్భాలు, కసురుకున్న వైనాలు చాలా ఉన్నాయి, ప్రతీ సినిమా సెట్లో... ఒక్కరైనా బాలయ్య బాధితుడు ఉంటాడు. `వీర సింహారెడ్డి`దీ ఇదే లెక్క.
బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా సెట్లో... కాస్ట్యూమ్ అసిస్టెంట్ పై బాలయ్య విశ్వరూపం చూపించాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. సెట్లో... కాస్ట్యూమ్ అసిస్టెంట్ ప్రవర్తన బాలయ్యకు చిరాకు తెప్పించిందని, అందుకే తనపై బాలయ్య ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడని, అదే కోపం నిర్మాతపైనా చూపించాడని తెలుస్తోంది. బాలయ్య ఫైర్ దగ్గరుండి చూసిన... సెట్లోని సభ్యులు గజగజలాడిపోయార్ట. ఇప్పుడు బాలయ్య ముందు నవ్వడానికీ, మాట్లాడడానికీ భయపడుతున్నారని టాక్. అంతే కాదు.. బాలయ్య ఆగ్రహానికి గురైన ఆ అసిస్టెంట్ సెట్ కి రావడమే మానేశాడని టాక్. ఇది వరకే... గోపీచంద్ మలినేనికి కూడా నాలుగు చివాట్లు పడ్డాయని, ఈ సినిమా పూర్తయ్యేలోగా ఇంకెన్ని జరుగుతాయో అని చిత్ర బృందం బిక్కుబిక్కుమంటోందని ఇన్ సైడ్ వర్గాల టాక్.