వెంకీ - వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఫన్ అండ్ ఫ్రక్టేషన్'. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లేటెస్టుగా వెంకటేష్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. మేకింగ్ స్టిల్‌కి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో వెంకీ లుంగీలో దర్శనమిస్తున్నాడు.
మొన్నామధ్య విడుదలైన ఓ ఫోటోలోనూ వరుణ్ లుంగీతోనే కనిపించాడు. ఇప్పుడీ లుంగీ ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఈ లుంగీ సీక్రెట్ ఏంటో తెలియాలంటే సినిమా విడుదలవ్వాల్సిందేనట. అంతవరకూ తెలిసే అవకాశం లేదట. అయినా లుంగీ వెంకీకి కొత్తేమీ కాదు. లుంగీలో చాలా హోమ్లీగా కనిపిస్తాడు వెంకటేష్.
అయితే ఈ సారి లుంగీలో వెంకీ, యంగ్ హీరో వరుణ్‌తో పోటీ పడుతున్నాడు. ఇకపోతే డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీకి పెద్ద పీట వేస్తాయి. వెంకీ కామెడీలో దిట్ట. వరుణ్‌కి మాత్రం కొంచెం కొత్తే. టైటిలే 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అని పెట్టారు. అంటే ఫ్రస్టేషన్ నుండే ఫన్ క్రియేట్ చేస్తారట ఈ ఇద్దరు హీరోలు.
ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందిన సమాచారమ్ ప్రకారం కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ మల్టీ స్టారర్ టాలీవుడ్‌లో ఎలాంటి ఫన్ క్రియేట్ చేస్తుందో. మరోవైపు వరుణ్ ఎట్ ఏ టైమ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ వైపు సంకల్ప్‌రెడ్డితో 'అంతరిక్షం' (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటిస్తూనే, ఈ 'ఎఫ్ 2'లో కూడా నటిస్తున్నాడు.