విక్టరీ వెంకటేష్ మంచి జోష్ లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆరునెలల గ్యాప్ తరువాత ఒకేసారి రెండు చిత్రాలకి పచ్చ జెండా ఊపడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఆయన పేరు మారుమ్రోగిపోతున్నది.
అందుతున్న వివరాల ప్రకారం, దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఒక మల్టీ స్టారర్ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాడట. దీనికి F2 అనే టైటిల్ ని కూడా పెట్టేసారట! ఈ చిత్రంలో వెంకీ తో పాటుగా మరో ప్రముఖ హీరో నటించనున్నాడు అని తెలుస్తున్నది.
ఇక ఈ ప్రాజెక్ట్ ని ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు నిర్మిస్తుండగా వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ జరగనుంది.
మొత్తానికి వెంకీ ఈ తరం మల్టీ స్టారర్స్ కి ఆధ్యుడు అని చెప్పొచ్చు.