బాల‌య్య త‌ప్పుకుంటే... వెంకీ వ‌చ్చేస్తాడు

By Gowthami - September 14, 2021 - 15:34 PM IST

మరిన్ని వార్తలు

ద‌స‌రా బ‌రిలో కొన్ని పెద్ద సినిమాలు నిల‌బ‌డ్డాయి. ఆచార్య‌, అఖండ‌లు ఈసారి ద‌స‌రాకి వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే... ఆచార్య విడుద‌ల లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఈసినిమా ఎట్టిప‌రిస్థితుల్లోనూ ద‌స‌రాకి రాద‌ని స‌మాచారం. ఇప్పుడు అఖండ కూడా అదే దారిలో వెళ్ల‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాని సైతం వాయిదా వేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అదే జ‌రిగితే ద‌స‌రా బోసిబోతుంది. చిరంజీవి, బాల‌కృష్ణ లాంటి స్టార్లు లేక‌పోవ‌డం ఈ ద‌స‌రాకు పెద్ద లోటే. అయితే.. ఈ అవ‌కాశాన్ని వెంకీ అందిపుచ్చుకోవాల‌ని చూస్తున్నాడు. అఖండ కూడా వాయిదా ప‌డితే... త‌న దృశ్య‌మ్ 2ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. వెంకీ న‌టించిన `నారప్ప‌` ఓటీటీలో విడుద‌లైంది. దృశ్య‌మ్ 2 కూడా ఓటీటీకే ఇచ్చేశారు. హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ద‌సరా కానుక‌గా ఈ సినిమాని హాట్ స్టార్ లో విడుద‌ల చేద్దాం అనుకున్నారు. అయితే అఖండ గ‌నుక‌... ద‌స‌రాకి రాక‌పోతే... ఆ అవ‌కాశాన్ని వాడుకోవాల‌ని వెంకీ చూస్తున్నాడు. అఖండ మిస్ అయితే... దృశ్య‌మ్ ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తార‌ట‌. దీనిపై చిత్ర‌బృందం హాట్ స్టార్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌ని టాక్‌. అయితే ఓటీటీలోనూ, థియేట‌ర్ల‌లోనే ఈ సినిమా ఒకేసారి విడుద‌ల అవుతుందా? లేదంటే ముందు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి, ఆ త‌ర‌వాత ఓటీటీలోకి వ‌స్తుందా అనేది చూడాలి.

 

ద‌స‌రా బ‌రిలో కొన్ని పెద్ద సినిమాలు నిల‌బ‌డ్డాయి. ఆచార్య‌, అఖండ‌లు ఈసారి ద‌స‌రాకి వ‌స్తాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS