ఈ టైటిల్ చూసి వెంకటేష్-రానాలు పాలిటిక్స్ లోకి దిగుతున్నరేమో అని అనుకోకండి. వీరిద్దరూ ఒక వెబ్ సిరీస్ లో భాగంగా ఒక పొలిటికల్ డ్రామాలో నటించానున్నారట!
అందుతున్న తాజా సమాచారం ప్రకారం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య జరిగిన నేపధ్యాన్ని ఓ వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ లో బాబాయ్-అబ్బాయ్ అయిన వెంకి-రానాలు ముఖ్య పాత్రల్లో నటించబోతున్నారట. రాజీవ్ గాంధీ హత్య నేపధ్యంలో ఆ ముందు వెనుక జరిగిన రాజకీయ పరిణామాల గురించి కూడా ఇందులో ఉండబోతున్నాయట.
దీనికి సంబందించిన ఒక అనధికారిక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్నది. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఇప్పటికే రానా సోషల్ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి విదితమే.
ఇక రాజీవ్ గాంధీ హత్య నేపధ్యంలో ఇప్పటికే పలు చలన చిత్రాలు రాగా అందులో ‘మద్రాస్ కేఫ్’ చిత్రం బాగా ప్రజాదరణ పొందింది.