క్రిందటి సంవత్సరమే ఇండస్ట్రీలో ౩౦ ఏండ్లు పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేష్ ఈ యేడు ఒక కొత్త తరహా పాత్రలో మన ముందుకి వస్తున్నాడు.
అదే హిందీలో వచ్చిన సాలా ఖడూస్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న గురు. నిన్ననే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు, ఆ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ, తన ౩౦ ఏళ్ళ కెరీర్ లో ఈ సినిమాకి తప్ప ఏ ఒక్క చిత్రానికి కూడా పూర్తి స్క్రిప్ట్ చదవలేదని తెలిపాడు.
కాని ఈ చిత్రానికి మాత్రం, డైరెక్టర్ సుధా పట్టుపట్టి నాచేత పూర్తి స్క్రిప్ట్ చదివించిందని చెప్పాడు. దాని వల్ల ఈ సినిమాలో నా కొత్త కోణాన్ని అందరు చూస్తారని ఆశాభావం వ్యక్తంచేశాడు.
మరి వెంకటేష్ కి ఈ చిత్రం మర్చిపోలేని జ్ఞాపకంగా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే