పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'కాటమరాయుడు' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. తొందర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పవన్ ఖాతాలో మరో కొత్త సినిమా వచ్చి చేరింది. యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో పవన్ ఓ సినిమాకి కమిట్ అయ్యారట. త్రివిక్రమ్‌తో పవన్ చేయాల్సిన సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుందని సమాచారమ్. అయితే పవన్ చేతిలో చేయాల్సిన మరిన్ని సినిమాలున్నాయి. ఇంతలోనే మరో కొత్త సినిమాకి కమిట్ అయ్యారు పవన్. ఏడాదికి ఒక్క సినిమా చేయడమే చాలా గొప్ప పవన్ కళ్యాణ్‌కి. అలాంటిది అస్సలు గ్యాపే లేకుండా సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఏ హీరోకి లేదింత దూకుడు. ఒక సినిమా పూర్తి కాగానే గ్యాప్ తీసుకోకుండా మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటారట పవన్ కళ్యాణ్. పవన్ కోసం సంతోష్ శ్రీనివాస్ ఓ కొత్త కథని ప్రిపేర్ చేశారట. అయితే ఆ కథ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే పవన్‌కి ఆ కథ చాలా బాగా నచ్చిందట. అంత బాగా పవన్‌ని ఇన్‌స్పైర్ చేసిన ఆ కథేంటో అంటూ అంతటా ఆశక్తి నెలకొంది. సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుంది. మరో పక్క రాజకీయాల్లో కూడా పవన్ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇంత స్పీడుగా సినిమాలు కూడా చేసేస్తున్నారు. పవన్ ప్రదర్శిస్తున్న ఈ జోరు చూస్తుంటే ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఈ నెల 24న పవన్ నటించిన 'కాటమరాయుడు' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.