వెంకీతో సినిమా లేన‌ట్టేనా?

By Inkmantra - March 20, 2020 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

పెళ్లిచూపులు సినిమాతో ఒక్క‌సారిగా త‌రుణ్ భాస్క‌ర్ పేరు మార్మోగిపోయింది. చిన్న సినిమాల‌కు ఊపొచ్చింది. ఈ న‌గ‌రానికి ఏమైంది ఆ స్థాయిలో ఆడ‌క‌పోయినా, త‌రుణ్ ఇమేజ్‌కి ఏమాత్రం డామేజీ క‌ల‌గ‌లేదు. ఆ వెంట‌నే వెంక‌టేష్‌తో సినిమా చేసే ఛాన్సొచ్చింది. క‌థ కూడా రెడీఅయ్యింది. నేడో - రేపో షూటింగ్ అన‌గా - ఈ క‌థ‌లో కొన్ని మార్పులు చేయాల‌ని సూచించాడు వెంకీ. ఆ మార్పుల్లో ఉండ‌గానే.. అసుర‌న్ రీమేక్ మొద‌లైపోయింది. అసుర‌న్ అయ్యాక‌... త‌రుణ్ సినిమా ప‌ట్టాలెక్కుతుంద‌నుకున్నారు.

 

అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేద‌ని, ఈసినిమాని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌ని స‌మాచారం. ఇంత వ‌ర‌కూ వెంకీ సినిమా చేస్తాడ‌ని ఆశ ప‌డిన త‌రుణ్‌కి నిరాశే మిగిలిన‌ట్టైంది. ఇప్పుడు ఈ క‌థ మ‌రో హీరోకి చెబుతాడా, లేదంటే కొత్త క‌థ రాసుకుని.. కొత్త హీరోతో ప్రొసీడ్ అవుతాడా.. అనేది తెలియాల్సివుంది. అయితే త‌రుణ్ అయితే ప్ర‌స్తుతానికి ఖాళీగా లేడు. ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాడు. మ‌రో వెబ్ సిరీస్ మొద‌లెట్టే ప‌నిలో ఉన్నాడు. ఈమ‌ధ్యే యాంక‌ర్ అవ‌తారం కూడా ఎత్తాడు. ఈ న‌గ‌రానికి ఏమైంది పేరుతో ఓ వెబ్ సిరీస్ రూపొందించే ప‌నిలో ఉన్నాడు. ఆ సినిమా ఎక్క‌డైతే ఆగిందో.. అక్క‌డి నుంచి ఈ క‌థ మొద‌లు కానుంది. ఈలోగా ఏ హీరో అయినా పిలిచి ఛాన్సిస్తే త‌ప్ప‌.. సినిమా తీసే మూడ్‌లో లేడు త‌రుణ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS