అభిమానులని కలవర పెడుతున్న వెంకీ నిర్ణయం..!

By iQlikMovies - April 11, 2018 - 16:02 PM IST

మరిన్ని వార్తలు

ఒకప్పుడు వెంకటేష్‌ చాలా స్పీడుగా సినిమాలు చేసేవాడు. ఇప్పుడు జోరు తగ్గింది. తేజ డైరెక్షన్‌లో సినిమా ఏమైందో తెలియడం లేదు. నారా రోహిత్‌, వెంకీ కాంబినేషన్‌లో సినిమా అన్నారు. అది కూడా అటకెక్కిందనీ తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ చేతిలో ఉన్న సినిమా ఒక్కటే. అదే 'ఎఫ్‌ 2'. వరుణ్‌ తేజ్‌, వెంకీ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

ఇకపోతే, మిగిలిన స్టార్‌ హీరోలైన బాలకృష్ణ, నాగార్జున ఫుల్‌ జోష్‌ మీదున్నారు. వరుస చిత్రాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి సినిమాలకు దూరమై, రాజకీయాల్లో సత్తా చాటి, తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినాక సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే వెంకీ మాత్రం ఎందుకో జోరు పెంచలేకపోతున్నాడు. 'గోపాల గోపాలా', 'దృశ్యం' సినిమాలతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ చాలా గ్యాప్‌ తీసుకుని 'గురు' చిత్రంతో వచ్చాడు. 'గురు' సినిమాతో కూడా వెంకీ మంచి సక్సెస్సే అందుకున్నాడు. మరి ఎందుకో ఈ ఆలస్యం తెలియడం లేదు. 

వెంకీ అభిమానులకు ఈ విషయం బాధని కలిగిస్తోంది. నాగార్జున ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. 'సోగ్గాడే చిన్ని నాయనా', రాజుగారి గది 2' సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు 'ఆఫీసర్‌'తో రానున్నాడు. త్వరలోనే నానితో మల్టీ స్టారర్‌లో కూడా నటించబోతున్నాడు. ఇలా సీనియర్‌ హీరోలంతా బిజీగా ఉంటే, వెంకీ మాత్రం స్వింగ్‌లో లేడు. 

వరుణ్‌తో చేయబోయే చిత్రం టైటిల్‌ ఫిక్సయ్యింది కానీ ఇంకా సినిమా పట్టాలెక్కలేదు. మరి వెంకీ జోరు పెంచేదెప్పుడు?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS