వెంకీ చేతిలో మ‌రో రెండు రీమేకులు

మరిన్ని వార్తలు

రీమేక్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్‌.. వెంక‌టేష్‌. ఈమ‌ధ్య అయితే వ‌రుస‌గా అవే చేస్తున్నాడు. నారప్ప ఇటీవ‌లే విడుద‌లైంది. దృశ్య‌మ్ 2 కూడా అదే దారిలో ఉంది. రెండూ రీమేక్‌లే. ఇప్పుడు త‌న ముందు మ‌రో రెండు రీమేక్ సినిమాలున్నాయ‌ని టాక్. అజిత్ హీరోగా నటించిన త‌మిళ‌ సూపర్ హిట్ ‘ఎన్నై అరిందాల్’ రీమేక్‌లో వెంక‌టేష్ న‌టిస్తున్నాడ‌ని ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. అప్ప‌ట్లో దీన్ని `ఎంత‌వాడుగానీ` అనే పేరుతో తెలుగులో డ‌బ్ చేశారు. కానీ జ‌నాలు స‌రిగా చూడ‌లేదు. ఆ సినిమాని కాస‌త్ అటూ ఇటూ చేసి రీమేక్ చేయాల‌ని వెంకీ భావిస్తున్నాడ‌ట‌. `విక్ర‌మ్ వేద‌` ని రీమేక్ చేయాల‌ని వెంకీ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాడ‌ట‌. మాధ‌వ‌న్, విజ‌య్‌సేతుప‌తి క‌థానాయ‌కులుగా న‌టించిన విక్ర‌మ్ వేదా.. ఓ మాస్ట‌ర్‌పీస్‌. అయితే.. ఈ సినిమాలో వెంకీతో పాటు న‌టించ‌డానికి మ‌రో హీరో కావాలి. ఆ హీరో కూడా స్టార్ అయ్యిండాలి. ఆ పాత్ర‌కు హీరో దొరికితే త‌ప్ప‌... విక్ర‌మ్ వేదా ప‌ట్టాలెక్క‌దు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS