'ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంక్రాంతి అల్లుళ్లుగా తమ స్టామినా ఏంటో చూపించిన వెంకటేష్, వరుణ్‌తేజ్‌లు ఇప్పుడు మరోసారి సందడి చేయబోతున్నారు. అయితే ఈ సారి సరికొత్తగా. విల్‌స్మిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అల్లాద్దీన్' హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌కి ఈ ఇద్దరూ వాయిస్ ఇస్తున్నారు. జీనీ పాత్రకు వెంకటేష్ డబ్బింగ్ చెప్పగా, అల్లాద్దీన్ పాత్రకు వరుణ్ వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైద్రాబాద్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో వెంకీ, వరుణ్ సరదాగా మీడియాతో ముచ్చటించారు.
వెంకీ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. డిస్నీ సినిమాలకు కావల్సిందే ఈ మ్యాజిక్. అందుకే అందరూ మెచ్చే జీనీ వాయిస్‌ని వెంకటేష్‌తో చెప్పించారు. చాలా రకాల వేరియేషన్స్ ఉంటాయి జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పాలంటే. స్వతహాగానే వెంకీకి జీనీ సినిమాలంటే ఇష్టమట. పిల్లలతో కలిసి ఆ సినిమాలు బాగా చూస్తుంటారట. అప్పుడప్పుడూ వాయిస్‌ని ఇమిటేట్ చేసేందుకూ ట్రై చేస్తుంటారట. అందుకే ఈ సినిమాలో జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పడం కాస్త ఈజీ అయ్యిందట కానీ, కాస్త ఎక్కువ సమయం పట్టిందట.
ఏది ఏమైనా వెంకీ వాయిస్ జీనీ పాత్రకు పెద్ద ప్లస్ అవుతుంనడం అతిశయోక్తి కాదు. ఇకపోతే 'ఎఫ్ 2'లో వరుణ్‌కి గైడ్‌గా వ్యవహరించిన వెంకీ, ఇక్కడ మేజికల్ గైడ్‌గా వ్యవహరించాడు. వరుణ్ అడిగిన కోరికలు తీరుస్తాడు. అల్లాద్దీన్ కథలు ఇప్పుడు కాదు, ఎప్పటికీ ఎవర్ గ్రీన్సే. అలాంటిది సరికొత్తగా వెంకీ, వరుణ్ వాయిస్‌తో వస్తున్న ఈ తాజా 'అల్లాద్దీన్' మరింత ఆకట్టుకుంటుందనడం అతిశయోక్తి కాదు. మే 24న 'అల్లాద్దీన్' వరల్డ్ వైడ్‌గా ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇంకెందుకాలస్యం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని, పిల్లలతో కలిసి పెద్దలూ మీరు కూడా ఎంజాయ్ చేసేయండిక.