ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'వెంకీ మామ' పోజిటివ్ టాక్‌తో హిట్ ఖాతాలోకి వెళ్లిపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రాబడుతూనే ఉంది. తర్వాత అంటే డిశంబర్ 20న విడుదలైన 'ప్రతిరోజూ పండగే', 'రూలర్' చిత్రాల్లో 'రూలర్'ని పెద్దగా పట్టించుకోలేదు జనం. కానీ, 'ప్రతిరోజూ పండగే' వసూళ్లు బాగున్నాయి. క్రిస్మస్కి 'ప్రతిరోజూ పండగే' హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో పండగ చేసుకుంటే, తదుపరి స్థానాన్ని 'వెంకీ మామ' ఆక్యుపై చేసింది. మాస్ సెంటర్స్‌లో కూడా 'రూలర్' నిలబడలేకపోయాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉండడంతో 'వెంకీ మామ' కలెక్షన్లు ఫర్వాలేదనిపిస్తున్నాడు.
తర్వాతి స్థానంలో కార్తి నటించిన 'దొంగ' వైపు అయినా ఆడియన్స్ దృష్టి పెట్టారు కానీ, ఎందుకో 'రూలర్'కి అంతగా ఆదరణ దక్కలేదు. మొత్తానికి క్రిస్మస్ హాలీడేస్ ఇటు 'వెంకీ మామ'కీ, అటు తేజు 'ప్రతిరోజూ పండగే'కి బాగా వర్కవుట్ అయ్యాయి. ఈ లోగా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ రెండు సినిమాలూ బాగానే క్యాష్ చేసుకుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి మహేష్ 'సరిలేరు నీకెవ్వరూ..' తర్వాత అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో..' వచ్చే వరకూ 'ప్రతిరోజూ పండగే', 'వెంకీ మామ'లకు కలెక్షన్స్ పండగే పండగ.