విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'వెంకీ మామ' ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ నేపథ్యంలో పక్కనే యంగ్ హీరో చైతూని పెట్టుకుని, సీనియర్ హీరో వెంకీని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు ముద్దుగుమ్మలు రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్, చైతూకి జోడీగా రాశీఖన్నా నటించిన సంగతి తెలిసిందే.
అయితే, సినిమా కోసం ఇన్ని రోజులు వీరితో ట్రావెల్ చేసిన ఈ ముద్దుగుమ్మలు చైతూని జెంటిల్‌మెన్ అంటూ కితాబిచ్చేశారు. కానీ, వెంకీ చాలా రొమాంటిక్ అట. అందుకే ఆయనకు ఇద్దరూ 'ఐ లవ్ యూ' చెప్పేశారు. సెట్స్‌లో ఉన్నప్పుడు వెంకటేష్ చాలా జోవియల్‌గా ఉండేవారనీ, ఆయన సీనియారిటీకి మొదట్లో చాలా భయపడ్డారట. కానీ, చాలా కంఫర్ట్‌బుల్‌గా తమతో వెంకీ ప్రవర్తించేవారనీ, 'వెంకీ మామ' షూటింగ్‌ని చాలా చాలా ఎంజాయ్ చేశామని ఈ ముద్దుగుమ్మలు చెప్పుకొస్తున్నారు. ఇక పాయల్ అయితే తెగ మురిసిపోతోంది.
కెరీర్ మొదట్లోనే వెంకీ లాంటి హీరోతో నటించే అవకాశం దక్కినందుకు ఆనందంతో ఊగిపోతోంది. 'వెంకీమామ' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే మంచి మూవీ అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సురేష్‌బాబు సొంత బ్యానర్‌లో నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు.