పచ్చని పొలాల మధ్య 'సూపర్‌స్టార్‌' డబుల్‌ ధమాకా!

మరిన్ని వార్తలు

చుట్టూ పచ్చని పొలాలు.. వాటి మధ్య అలా అలా నడిచి వస్తున్న ఇద్దరు సూపర్‌ స్టార్లు.. ఈ చిత్రం చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదనిపిస్తోంది. అందుకే ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా, లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ..' చిత్రం నుండి 'సూర్యడివో.. చంద్రుడివో..' అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేసేందుకు ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిముషాలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వదిలిన పోస్టర్‌ అందరిలోనూ క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. సూపర్‌ క్లాస్‌ మెలోడీ సాంగ్‌ అని ఈ పోస్టర్‌ చూస్తుంటేనే అర్ధమవుతోంది.

 

రామ జోగయ్యశాస్త్రి అద్భుతమైన సాహిత్యంతో, రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌లో రానున్న ఈ సాంగ్‌ వీనుల విందుగా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, టీజర్‌లోని డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక రాబోయే సాంగ్‌ ఆ అంచనాల్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లడం ఖాయమని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. రష్మిక మండన్నా ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో, దిల్‌ రాజుతో కలిసి మహేష్‌ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS