అరె.. 'వెంకీ మామ'కి క్లారిటీ వచ్చేసింది.

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ 'వెంకీ మామ'. అయితే చాలా రోజుల నుండి 'వెంకీ మామ' రిలీజ్ విషయమై తీవ్ర తర్జన భర్జన జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట డిసెంబర్ ఆఖరున అని, ఆ తరువాత జనవరి ఆరంభంలో అని ఇలా చాలా డేట్లు వినిపించాయి. చివరికి చాలా సినిమాలు విడుదలకు రెడీగా ఉండటంతో, ఈ సినిమా విడుదల విషయంలో ఇన్నాళ్లు ఆలోచించిన నిర్మాత సురేష్ బాబు ఎట్టకేలకు తుది నిర్ణయాన్ని తీసేసుకున్నారట. చిత్రాన్ని విక్ట‌రీ వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబర్ 13న విడుద‌ల చేస్తున్నారు.

 

డిసెంబర్ మూడో వారంలో 'రూలర్, ప్రతిరోజూ పండగే' సినిమాలు ఉన్నాయి. అలాగే సంక్రాంతికి జనవరి 12న మహేష్, బన్నీల చిత్రాలు ఉన్నాయి. అందుకే డిసెంబర్ 13న వెంకీమామను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ ఫ్యామిలీ ఎంటెర్టైనర్లో నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కె.ఎస్.రవీంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS