నవలల్ని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఈమధ్య ముమ్మరం అవుతున్నాయి. `కొండ పొలం` నవలని క్రిష్ సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్నారు. `సప్తభూమి` నవల కూడా త్వరలోనే సినిమాగా రాబోతోంది. చలం `మైదానం` నవలని ఇప్పుడు ఓటీటీ కోసం సినిమాగా తీస్తున్నారు. వేణు ఉడుగుల ఈ చిత్రానికి నిర్మాత. ఆహా లో `మైదానం` స్ట్రీమింగ్ కానుంది.
ఇందులో కథానాయకుడి పాత్రకు వెన్నెల కిషోర్ ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. వెన్నెల కిషోర్ ది మంచి కామెడీ టైమిగ్. హాస్య నటుడిగా తనదైన ముద్ర వేశాడు. అయితే `చలం` మైదానంలో కథానాయకుడి పాత్ర కాస్త సీరియస్ లుక్లో సాగిపోతుంది. కథానాయకుడి పాత్ర కంటే నాయిక పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇలాంటి పాత్రని ఎంచుకోవడం వెన్నెల కిషోర్ కి సాహసమే అని చెప్పాలి. మరి ఈ పాత్రలో ఎంత వరకూ మెప్పిస్తాడో చూడాలి.