పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నారు క్రిష్. అయితే కరోనా గ్యాప్ లో చదివిన ఓ నవల ఆయనకు తెగ నచ్చింది. వెంటనే సినిమాగా తెరకెక్కించారు. అదే కొండపొలం. అయితే సినిమా బాక్సాఫీసు వద్ద అంత ప్రభావం చూపించలేదు. కానీ డిజిటల్ శాటిలైట్ లో సత్తా చాటింది. కొండపొలం ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
మంచి వ్యూవర్ షిఫ్ వచ్చింది. తాజాగా కొండపొలం స్టార్ మాలో ప్రసారమైంది. బుల్లితెరపై ఈ సినిమా అత్యధిక టీఆర్పీని దక్కించుకుంది. అర్బన్ ఏరియాల్లో ఈ సినిమాకు 12.43 టీఆర్పీ వచ్చింది. రూరల్, అర్బన్ రెండు కలిపి ఈ మూవీ ఓవరాల్ గా 10.54 టీఆర్పీని వచ్చింది. బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఆడిన ఈ మూవీ బుల్లితెరపై మాత్రం భారీ టీఆర్పీ దక్కించుకుంది. క్రిష్ సినిమాలన్నీ బుల్లితరపై సూపర్ హిట్స్ అనే ఆనవాయితిని కొండపొలం కూడా కంటిన్యూ చేసిందనే చెప్పాలి.