రాజకీయాలపై సుమన్‌ హాట్‌ కామెంట్స్‌.!

By iQlikMovies - November 30, 2018 - 11:36 AM IST

మరిన్ని వార్తలు

సుమన్‌ హాట్‌ కామెంట్స్‌


2019 ఎలక్షన్స్‌ దగ్గర పడుతున్న తరుణంలో పోలిటిక్స్‌లో సినీ గ్లామర్‌ అంతకంతకూ పెరుగుతోంది. టీడీపీ తరపున తెలంగాణాలో దివంగత హరికృష్ణ తనయ సుహాసిని పోటీకి దిగగా, ఆమెకు మద్దతుగా బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌, తారకరత్నత తదితర నందమూరి హీరోలు మద్దతు పలుకుతున్నారు. ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. ఇకపోతే టీఆర్‌ఎస్‌కి సంబంధించి కూడా పలువురు సినీ తారలు కేసీఆర్‌కి మద్దతు పలుకుతున్నారు. ప్రకాష్‌రాజ్‌ తన దృష్టిలో కేసీఆర్‌ గుడ్‌ అన్నారు.

 

తాజాగా మరో సీనియర్‌ నటుడు సుమన్‌ కూడా కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన పరిధిలో కేసీఆర్‌ తెలుగు సినిమాకి చాలా మేలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే స్కూల్‌కి హెడ్‌మాస్టర్‌గా ఎక్కువ వయసున్న వ్యక్తినే ఎంచుకుంటాం. ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు వంటి వ్యక్తి అనుభవం ఎంతో అవసరం. అయితే ఆయన తెలంగాణా విషయంలో జోక్యం చేసుకోకుండా, ఆయన అనుభవాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం చేస్తే మంచిదనీ ఆయన అభిప్రాయపడ్డారు.

 

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీనే కరెక్ట్‌ అని సుమన్‌ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే, బండ్ల గణేష్‌ గురించి కూడా ఆయన ప్రస్థావించారు. బండ్ల గణేష్‌ తనకు మంచి స్నేహితుడు అనీ, ఆయన మాట్లాడే మాటలు పోలిటిక్స్‌లో బాగా ఉపయోగపడతాయనీ, పోలిటిక్స్‌లో అలాగే మాట్లాడాలనీ బండ్ల గణేష్‌ని ఉద్దేశించి సుమన్‌ తన అభిప్రాయం తెలిపారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఉత్సాహవంతుడు. ప్రజల సమస్యలపై సరైన అవగాహన ఉన్న వ్యక్తి అని పవన్‌ కళ్యాణ్‌ అని సుమన్‌ వ్యాఖ్యానించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS