ఎన్టీఆర్‌ బయోపిక్‌: విద్యా బాలన్‌ నో కన్‌ఫామ్‌.!

By iQlikMovies - July 04, 2018 - 10:33 AM IST

మరిన్ని వార్తలు

స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ 'ఎన్టీఆర్‌'లో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ దాదాపుగా కన్‌ఫామ్‌ అయినట్లే అని ఈ మధ్య జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనికి సంబంధించి ఫ్రెష్‌ అప్‌డేట్‌ ఏంటంటే, ఈ సినిమాలో విద్యాబాలన్‌ ఇంకా కన్‌ఫామ్‌ కాలేదట. ఈ విషయాన్ని స్వయంగా విద్యాబాలనే కన్‌ఫామ్‌ చేసింది. 

ఆ పాత్ర కోసం తననింకా ఎవరూ సంప్రదించలేదనీ ఈమె చెప్పింది. కథ నచ్చితే నటించేందుకు తనకేం అభ్యంతరాల్లేవనీ చూచాయగా సంకేతాలిచ్చింది. ఇప్పుడీ ప్రాజెక్ట్‌ క్రిష్‌ చేతిలో ఉంది. క్రిష్‌కి తెలుగుతో పాటు, హిందీలో కూడా మంచి పేరుంది. సో క్రిష్‌ అడిగితే కాదనేవారుండరు. అందులోనూ ఈ బయోపిక్‌ను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు. 

సో ఖచ్చితంగా తెలుగు నటీనటులతో పాటు, హిందీలోనూ ప్రముఖ నటీనటుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. హుందా అయిన పాత్రలకు విద్యాబాలన్‌ సరిగ్గా సూటయిపోతుంది. అలాంటిదింకా క్రిష్‌, విద్యాని ఎందుకు ఓకే చేయలేదో. ఎన్టీఆర్‌ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. టాలీవుడ్‌ నుండి పలువురు యంగ్‌ హీరోస్‌తో పాటు, సీనియర్‌ నటులు కూడా ఈ సినిమాలో నటించనున్నారు. 

స్టార్‌ హీరో మహేష్‌బాబు కూడా ఈ సినిమాలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వనున్నాడనీ తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS