తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తనయ సౌందర్య రూపొందించిన 'కొచాడియన్' సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. మోషన్ క్యాప్చర్ విధానంలో ఈ సినిమాని రూపొందించారు. తెలుగులో 'విక్రమసింహా' పేరుతో విడుదలైంది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్స్‌ని, ఎగ్జిక్యూటర్స్‌ని నిండా ముంచేసింది. ఆ సినిమాకి సంబంధించి ఓ సంస్థకు రజనీకాంత్ కుటుంబం ఆరున్నర కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ కేసు సూపర్ స్టార్ కుటుంబాన్ని వివాదంలో పడేసింది.
తాజాగా ఈ కేసుకు సంబంధించి, న్యాయస్ఠానం రజనీకాంత్ సతీమణికి క్లాస్ తీసుకుంది. తక్షణం ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఇలా 'కొచ్చాడియన్' మాత్రమే కాదు, ఆ తర్వాత చేసిన 'లింగా', 'కబాలి' చిత్రాలు కూడా సూపర్ స్టార్ కెరీర్‌ని దెబ్బ తీసేశాయి. అది చాలక ఇటీవల అల్లుడు ధనుష్ రూపొందించిన 'కాలా' చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటర్స్‌ని ఇబ్బందుల్లో పడేశాయి.
ఈ కష్టాలన్నీ ఒకెత్తు. తండ్రి పేరు చెప్పి తన ఇమేజ్ పెంచుకుందామనుకున్న సౌందర్య 'కొచ్చాడియన్'తో తిరుగులేని ఫ్లాప్ చవి చూడడమే కాక, తల్లితండ్రుల్ని ఇరకాటంలో పడేసింది. మరోవైపు భారీ అంచనాలతో తెరకెక్కిన 'రోబో 2.0' చిత్రం ఇంతవరకూ విడుదలకు నోచుకోవడం లేదు. ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా సరైన స్పష్టత లేదు.
ఈ సినిమా అయినా సూపర్ స్టార్ ఇమేజ్‌ని తిరిగి తీసుకొస్తుందేమో చూడాలిక.