హీరోయిన్స్ అంటే స్లిమ్‌గా అందంగా ఉండాలి. జీరోసైజ్ అయినా ఓకే కానీ, కొంచెం బొద్దుగా ఉన్నా అవకాశాలు ఆమడ దూరం పరుగెత్తేస్తాయి. కానీ విద్యాబాలన్ విషయంలో ఆ రూల్ అస్సలు పని చేయదు. ఎందుకంటే ఈమెకు ఫిజిక్‌తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉంటాయి.
హీరోయిన్‌గానే కాకుండా, వాణిజ్య ప్రకటనల్లోనూ ఆమెకు ఆమె రూపమే అసలు సిసలు అలంకారం. ఇకపోతే ఇటీవల తెలుగులో 'ఎన్టీఆర్ కథానాయకుడు'తో విద్యాబాలన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా విద్యాబాలన్‌కి మంచి గుర్తింపు దక్కింది. ఇదిలా ఉంటే సౌత్‌లో మరో సినిమాకి విద్యా సైన్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ 'పింక్' తమిళ రీమేక్ 'ఏకే 59'లో అజిత్‌కి జోడీగా విద్యాబాలన్ నటిస్తోంది. హిందీలో ఓ బయోపిక్‌లో నటిస్తోంది. ఇదిలా ఉంటే, తన ఫిజిక్ గురించి ఆమె అభిమానులు కొందరు ఆందోళన చెందుతున్నారట. గతంతో పోల్చితే ఈ మధ్య విద్యాబాలన్ బాగా బరువు పెరగింది. ఇంకా పెరిగితే కష్టమనీ, బరువు తగ్గించమనీ ఆమెకు ఉచిత సలహాలిస్తున్నారట. అయితే విద్యాబాలన్ తనకు సమ్‌థింగ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనీ, అందుకే బరువు పెరుగుతున్నాననీ, తనను అభిమానించే అభిమానుల సూచన మేరకు బరువు తగ్గే ప్రయత్నం చేస్తాననీ చెబుతోంది.
హీరోయిన్‌గానే కాకుండా, కమర్షియల్ యాడ్స్‌లోనూ విద్యాబాలన్ యాక్టివ్‌గా ఉంటుంది. అన్నట్లు ఈ మధ్య డబూ రత్నానీ క్యాలెండర్ కోసం విద్యా కేక పుట్టించే హాట్ పోజుతో ఆకట్టుకుంది ఈ పిజిక్‌తోనే. కెరీర్‌లో తనకెలాంటి అడ్డంకి లేని ఫిజిక్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా, ఆ టైంని మరిన్ని ఆఫర్స్ దక్కించుకోవడానికి ఎలా సద్వినియోగం చేసుకోవాలో విద్యాబాలన్‌కి తెలుసండోయ్.