విద్యాబాలన్‌ క్లారిటీ ఇచ్చేసింది.!

మరిన్ని వార్తలు

కొన్ని హుందా అయిన పాత్రలకు బాలీవుడ్‌ బ్యూటీ విద్యా బాలన్‌ ఇట్టే సరిపోతుంది. ముఖ్యంగా హోమ్లీ గాళ్‌ పాత్రల్లో ఈమె పేరును ముందు వరసలో ఉంచొచ్చు. తెలుగు, హిందీ సినిమాల్లో ఐటెం బాంబ్‌గా పేరు పొందిన సిల్క్‌స్మిత బయోపిక్‌ 'ది డర్టీ పిక్చర్‌' సినిమాతో విద్యా బాలన్‌ పేరు తెలుగు ప్రేక్షకులు ప్రతీ ఒక్కరికీ సుపరిచితమైపోయింది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ తెలుగులోకీ ఎంట్రీ ఇస్తోంది. అది కూడా ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌' బయోపిక్‌. గత కొంత కాలంగా 'ఎన్టీఆర్‌' బయోపిక్‌లో విద్యాబాలన్‌ నిటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై భిన్న సందేహాలు వచ్చాయి ఇంతవరకూ. ఈ మధ్యనే ఆఫీషియల్‌గా చిత్ర యూనిట్‌ ఇచ్చిన ప్రకటనతో ఈ సందేహాలకు చెక్‌ పడింది. ఈమె పేరు 'ఎన్టీఆర్‌' బయోపిక్‌కి ఫిక్స్‌ చేసేశారు. 

ఎన్టీఆర్‌ మొదటి భార్య బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్‌ పేరును అఫీషియల్‌గా ప్రకటించారు. ఇలాంటి ఓ ప్రత్యేకమైన సినిమాతో తన తెలుగు సినిమా తెరంగేట్రం ఉండడం తనకెంతో సంతోషంగా ఉందనీ విద్యాబాలన్‌ చెబుతోంది. అంతేకాదు, ఈ పాత్రలో భావోద్వేగాలు తననెంతో ఇంప్రెస్‌ చేశాయనీ, ఈ పాత్రకు తగ్గ న్యాయం చేసే దిశగా తన నటన ఉంటుందనీ అంటోంది. 

'డర్టీ పిక్చర్‌'లో సిల్క్‌ పాత్ర తర్వాత తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో దగ్గరవుతుండడం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తోందని విద్యాబాలన్‌ అంటోంది. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలయ్య స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS