తెలుగు, తమిళ సినిమాల్లో హాస్య నటిగా వెలుగొందుతున్న వర్థమాన తార.. విద్యుల్లేఖా రామన్. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలెట్టేందుకు సమాయాత్తం అవుతోంది. ఇటీవల చెన్నైలో విద్యుల్లేఖ నిశ్చితార్థం జరిగింది. ఫిట్ నెస్ ట్రైనర్ సంజయ్‌ని పెళ్లాడనున్నారు. లాక్ డౌన్ సమయంలో తన ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది విద్యుల్లేఖ.
ఇది వరకు చాలా బొద్దుగా ఉండే లేఖ.. ఇప్పుడు బాగా సన్నబడింది. అదంతా.... సంజయ్ ఇచ్చిన ట్రైనింగ్ వల్లే. అప్పుడే.. వీరిద్దరి మధ్య స్నేహం బలపడి, ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల వాళ్లూ పెళ్లికి పచ్చజెండా ఊపడంతో.. నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టేశార్ట. త్వరలోనే ఆ కబురూ చెప్పనుంది రామన్.