విజయ్ మెర్సల్ చిత్రం తెలుగులో అదిరిందిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ చిత్ర విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా GST పైన అనుచిత వ్యాఖ్యలు ఈ చిత్రంలో ఉన్నాయి అన్న అభిప్రాయంతో ఈ చిత్రాన్ని ఆపేయాలంటూ వాదనలు వినపడ్డాయి.
ఇక ఈ తరుణంలో రేపు తెలుగులో విడుదల కానుంది. మరి ఈ తెలుగు వెర్షన్ తమిళ చిత్రంలానే పెద్ద హిట్ అవుతుందా లేదా అనే ఇక్కడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో విజయ్ కి కొద్దో గొప్పో మార్కెట్ ఉన్న నేపధ్యంలో ఈ చిత్రం ఆయన కెరీర్ గ్రాఫ్ పైన ఎటువంటి ప్రభావం పడనుందో చూడాలి.