టాలీవుడ్‌లో సరికొత్త ప్రభంజనం.. విజయ్ దేవరకొండ. వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకీ తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈమధ్యే సొంత ఇంట్లోకి అడుగుపెట్టాడు. విజయ్ సొంత ఇల్లు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
హీరోలు కొత్త ఇల్లు కొనుక్కోవడం, గృహ ప్రవేశం చేయడం మామూలు విషయాలే. కానీ.. విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అదో హాట టాపిక్ అయ్యింది. ఎందుకంటే ఈ ఇల్లు అంత ఖరీదు మరి. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో విజయ్ ఇల్లు కొనుక్కున్నాడు. తన అభిరుచికి తగ్గట్టుగా, స్టైలీష్‌గా ఇంటీరియర్ కూడా చేయించుకున్నాడు.
ఈ ఇంటి విలువ దాదాపు 20 కోట్లని తెలుస్తోంది. పెళ్లి చూపులు సినిమాతో విజయ్ జర్నీ ప్రారంభమైంది. కానీ స్టార్‌గా మారింది మాత్రం `అర్జున్ రెడ్డి` తరవాతే. ఇప్పుడు విజయ్ పారితోషికం 8 నుంచి 10 కోట్ల వరకూ ఉంది. అంత పారితోషికం తీసుకుంటున్నప్పుడు ఇంత ఖరీదైన ఇల్లు కొనుక్కోవడం వింతేముంది..?