విడుదలకు ముందే లీక్ అయిన సినిమాతో కూడా వసూళ్ళను కుమ్మేయొచ్చని ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, 'అత్తారింటికి దారేది' మ్యాజిక్‌ని తన 'ట్యాక్సీవాలా'తో రిపీట్ చేశాడు. మామూలుగా శుక్రవారం సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. గురువారం విడుదలవడం అరుదు. బుధవారం సినిమా ఇంకా అరుదు. మంగళవారం చాలా చాలా కష్టం. శనివారం సినిమా విడుదల చేయడం దండగని చాలామంది అభిప్రాయపడ్తుంటారు. కానీ, 'ట్యాక్సీవాలా' రిస్క్ చేశాడు.
శనివారం సినిమా విడుదలైంది. శని, ఆదివారాల్లో బాగా కుమ్మేశాడు. సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా సేమ్ సీన్. ఇంకో సోమవారం వచ్చేసింది. వసూళ్ళ విషయంలో కొంచెం తగ్గుదల నమోదయ్యింది. వీక్ డేస్‌లో ఇది మామూలే. ఫస్ట్ వీకెండ్ తర్వాత.. అంటే, నాలుగు లేదా ఐదో రోజున వసూళ్ళు అంత తేలిక కాదు. అలాంటిది వారం రోజులు గడిచిపోయాక వచ్చిన సోమవారం కూడా వసూళ్ళ జాతర కొనసాగుతోంది. 'ఈ సినిమాతో హిట్టు కొడతానని ముందే తెలుసు. అందుకే చెప్పాను, కొట్టాను..' అని కాన్ఫిడెంట్‌గా విజయ్ వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
వాస్తవానికి 'నోటా' సినిమా విజయ్‌కి చాలా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఆ షాక్ నుంచి తేరుకోవడానికి పెద్దగా టైమ్ పట్టలేదు విజయ్‌కి. యస్, విజయ్ ఈజ్ ఆన్ సూపర్ హిట్ ట్రాక్. చాలా త్వరగా 'నోటా' ఫెయిల్యూర్‌ని విజయ్ దేవరకొండతోపాటు, ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ కూడా మర్చిపోయింది. ఆ స్థాయిలో 'ట్యాక్సీవాలా' వసూళ్ళను కుమ్మేస్తోంది మరి.