రౌడీస్టార్‌లో ఆ టాలెంట్‌ కూడా ఉందట!

మరిన్ని వార్తలు

సంచలన హీరో విజయ్‌దేవరకొండలో అందరికీ తెలియని ఇంకో టాలెంట్‌ కూడా ఉందట. అదేంటో తెలుసా.? రైటర్‌. హా.. అవునండీ ఇది నిజం. విజయ్‌దేవరకొండ మంచి రైటర్‌ అట. తన దగ్గర చాలా చాలా కథలున్నాయట. అయితే ఇవన్నీ తన కోసమే వాడుకుంటాడట. ఎవరికీ ఇవ్వడట. నిజంగా నిజమే కానీ, ఈ నిజాలన్నీ రియల్‌ కాదు రీల్‌ కోసం. 'డియర్‌ కామ్రేడ్‌' సినిమా తర్వాత విజయ్‌దేవరకొండ క్రాంతి మాధవ్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ. ఈ సినిమాలోనే విజయ్‌ దేవరకొండ రైటర్‌గా కనిపించబోతున్నారట.

 

ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన ఏకంగా ముగ్గురు భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసాబెల్లే. డిఫరెంట్‌ షేడ్స్‌లో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నాడట ఈ సినిమాలో. ఇదిలా ఉంటే, 'డియర్‌ కామ్రేడ్‌' జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. ఆల్రెడీ రెండు ఆడియో సింగిల్స్‌ విడుదల చేశారు. రెండూ రెండే మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసేశాయి. ఇక రేపు రానున్న మూడో సాంగ్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేయనుందో చూడాలిక. తెలుగుతో పాటు ఏకంగా నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో భరత్‌ కమ్మ దర్శకుడుగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS