వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' అవతారమెత్తిన రౌడీ స్టార్‌!

మరిన్ని వార్తలు

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌.. ఈ మాట ఎప్పుడో ఎక్కడో విన్నట్లుంది కదా.. అవునండీ. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన 'ఆరెంజ్‌' సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో రామ్‌ చరణ్‌ పదే పదే అనే మాట ఇదే. వరల్డ్‌ గ్రేటెస్ట్ లవర్‌ అని. ఇప్పుడు అలాంటి టైటిల్‌తో మన రౌడీస్టార్‌ ఉన్నాడు కదా.. విజయ్‌ దేవరకొండ, ఆయన ఓ సినిమా చేసేస్తున్నాడు. అదే 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కె.ఎ.వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

'ఆరెంజ్‌' లో రామ్‌చరణ్‌కి 9 మంది లవర్స్‌ ఉండగా, ఈ సినిమాలో మనోడు కూడా ఏం తక్కువ తినలేదండోయ్‌. ఏకంగా నలుగురు హీరోయిన్స్‌తో లవ్వాడేసుకుంటున్నాడు. మొదట్లో ఈ సినిమాకి 'బ్రేకప్‌' అనే టైటిల్‌ పెట్టాలనుకున్నారు. కథానుగుణంగా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' అనే టైటిల్‌ యాప్ట్‌ అవుతుందని ఈ టైటిల్‌నే ఫిక్స్‌ చేసి అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు.

 

ఈ సినిమాలో మనోడి సరసన నటించబోయే ఆ నలుగురు ముద్దుగుమ్మల లిస్ట్‌ తీసుకుంటే, అందాల రాశీఖన్నా మెయిన్‌ లీడ్‌ పోషిస్తోంది. ఈమెతో పాటు, ఇసా బెల్లా, ఐశ్వర్యా రాజేష్‌, కేథరిన్‌ మిగిలిన హీరోయిన్స్‌ అన్నమాట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఈ నెల 20 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయబోతున్నామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. గోపీ సుందర్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS