ప్ర‌భాస్‌కి రౌడీ ఓ చిరు స‌ల‌హా!

మరిన్ని వార్తలు

టాలీవుడ్ యంగ్ హీరోల్లో త‌న‌కంటూ ఓ స్థానం ద‌క్కించుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. స్టార్ హీరోల‌తో పోటీ ప‌డుతూ అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్‌కి ఓ మంచి, విలువైన `చిరు` స‌లహా ఇచ్చాడు. ప్ర‌భాస్ టెర్మినేట‌ర్ లాంటి సినిమాలు చేయాల‌ని, ఆ స్థాయి ప్ర‌భాస్‌కి ఉంద‌న్నాడు. యాక్ష‌న్ సినిమాల‌కు ప్ర‌భాస్ కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాడు.

 

సాహోలో ప్ర‌భాస్‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు హాలీవుడ్‌ని మ‌రిపించేలానే ఉన్నాయి. అందుకే.. రౌడీ ఇలాంటి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసి ఉంటాడు. ప్ర‌భాస్‌ని ఆ రేంజు హీరోగానే అభిమానులు చూసుకుంటున్నారు. నిజంగా... అలాంటి ఆలోచ‌న‌తో ద‌ర్శ‌కులెవ‌రైనా ప్ర‌భాస్‌ని సంప్ర‌దిస్తే... బాగుంటుందేమో.? హాలీవుడ్ చిత్రం `టెర్మెనేట‌ర్ డార్క్ ఫేట్‌` చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైల‌ర్‌ని ఈరోజు హైద‌రాబాద్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఆవిష్క‌రించాడు.

 

ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ని గుర్తు చేసుకున్నాడు విజ‌య్‌. త‌ను హాలీవుడ్ సినిమాల‌కు అభిమాన‌ని, టెర్మెనేట‌ర్ సినిమాలు ఎక్కువ‌గా చూస్తుంటాన‌ని, ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు విజ‌య్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS