రౌడీస్టార్‌తో కైరా అద్వానీ 'జోడీ' అదుర్స్‌!

By Inkmantra - September 09, 2019 - 17:30 PM IST

మరిన్ని వార్తలు

రౌడీస్టార్‌తో ముద్దుగుమ్మ కైరా అద్వానీ ఎట్టకేలకు జత కట్టేసింది. అదేంటీ ఏ సినిమా కోసం అనుకుంటున్నారా.? అయితే అసలు వివరాలు తెలియాల్సిందే మీకు. ఈ ఇద్దరూ జత కట్టిన విషయం నిజమే. ఇదేం గాసిప్‌ కాదు. కానీ, సినిమా కోసం కాదు. ఓ కమర్షియల్‌ యాడ్‌ షూట్‌ కోసం. మీబాజ్‌ వరల్డ్‌ అనే సాంప్రదాయ వస్త్ర దుకాణానికి ఈ ఇద్దరూ బ్రాండ్‌ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.

 

లేటెస్ట్‌గా వీరిద్దరిపై ఆ యాడ్‌ షూట్‌ జరిగింది. ఈ యాడ్‌లో నటించేందుకు కైరా అద్వానీ, విజయ్‌ దేవరకొండ సాంప్రదాయ దుస్తులు ధరించి కలర్‌ఫుల్‌గా కనిపించారు. ముంబయ్‌లో ఈ యాడ్‌ షూట్‌ జరిగింది. మనీష్‌ మల్హోత్రా సారధ్యంలో ఈ యాడ్‌ షూట్‌ జరిగిందని తెలుస్తోంది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ని కూడా మీట్‌ అయ్యారట.

 

ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్యా ఫ్యూచర్‌ ప్రాజెక్టుల డిస్కషన్‌ వచ్చినట్లు బాలీవుడ్‌ సమాచారమ్‌. ఎప్పటి నుండో కరణ్‌జోహార్‌ - విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా అని ప్రచారం జరుగుతోంది. అలాగే కైరా అద్వానీతో విజయ్‌ దేవరకొండ జోడీ అని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే, సినిమా కోసం కాదు కానీ, ఎలాగైతేనేం, ఈ జంట ఒక్కటిగా కెమెరాకి చిక్కి, ఫ్యాన్స్‌ కోరిక తీర్చినట్టయ్యింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS