విజయ్‌ దేవరకొండ.. చెయ్యలేనంటూనే చేసేశాడుగా.!

మరిన్ని వార్తలు

‘మా ఇంట్లో నన్ను ఇంకా చిన్న పిల్లాడిగానే చూస్తున్నారు.. ఇంటి పనులు చేయాలని నేననుకున్నా, నన్ను ఏ పనీ చెయ్యనివ్వట్లే..’ అంటూ ‘బి ది రియల్‌ మేన్‌’ ఛాలెంజ్‌ విషయమై విజయ్‌ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశాడు.. కాస్త ఫన్నీగానే. అయినాగానీ, ట్రై చేస్తానంటూ ఓ గ్లింప్స్‌ వదులుతున్నట్లు వెల్లడించాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి విజయ్‌ దేవరకొండ ఓ గ్లింప్స్‌ విడుదల చేశాడు. తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ ఈ తతంగాన్ని షూట్‌ చేశాడట. పొద్దున్నే నిద్ర లేచి.. దుప్పటి మడత పెట్టేశాడు జాగ్రత్తగా విజయ్‌. మామూలుగా అయితే ఆరు గంటల సమయం నిద్రపోతాననీ, ఇప్పుడు 9 గంటల పాటు నిద్ర పోవాల్సి వస్తోందంటూ లాక్‌డౌన్‌ కష్టాల గురించి చెప్పుకున్నాడు. పొద్దున్నే ఓ లీటర్‌ మంచి నీళ్ళు తాగాడు.

 

ఆ తర్వాత ఓ ప్లాస్టిక్‌ కవర్‌ని డస్ట్‌బిన్‌కి అతికించాడు. మ్యాంగోస్‌ తీసుకుని, తొక్క తీసి.. జ్యూస్‌ని తయారు చేసి.. డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టాడు. ఆ తర్వాత కాస్సేపటికి తన తల్లికీ, తన సోదరుడికీ ఆ క్రీవ్‌ు సర్వ్‌ చేశాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. మధ్యలో టీవీ కూడా క్లీన్‌ చేశాడండోయ్‌. ఇదీ విజయ్‌ దేవరకొండ చూపించిన గ్లింప్స్‌. విజయ్‌ నుంచి జస్ట్‌ ఓ ‘కామెంట్‌’ సోషల్‌ మీడియాలో పోస్ట్‌గా వస్తే చాలు రౌడీస్‌ ఓ రేంజ్‌లో సందడి చేసేస్తారు. అలాంటిది ‘బి ది రియల్‌ మ్యాన్‌’ అంటూ ఓ గ్లింప్స్‌ విడుదల చేస్తే ఆగుతారా.? అన్నట్టు, మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ని ఈ ఛాలెంజ్‌కిగాను నామినేట్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS