ఇక్కడ లేదు కానీ, అబ్బో..! అక్కడ మామూలుగా లేదండోయ్‌

By Inkmantra - January 22, 2020 - 17:00 PM IST

మరిన్ని వార్తలు

సెన్సేషన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయాడు విజయ్‌ దేవరకొండ. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా.. ఎందుకు సెన్సేషన్‌ అవుతున్నాడో అర్ధం కాని పరిస్థితి మనోడి విషయంలో. ఇప్పుడీ సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన 'డియర్‌ కామ్రేడ్‌' బాలీవుడ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. అదేంటీ.? బాలీవుడ్‌లో ఈ సినిమా ఎప్పుడు రిలీజయ్యిందా.? అని ఆశ్చర్యపోతున్నారా.? బాలీవుడ్‌లో రిలీజ్‌ కాలేదు కానీ, ఈ సినిమా హిందీ వెర్షన్‌ తాజాగా యూ ట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. ఇలా రిలీజయ్యిందో లేదో.. బాలీవుడ్‌ జనం ఈ సినిమాని చూసేందుకు క్యూ కట్టేశారు. అత్యధిక సంఖ్యలో ఈ సినిమాని యూ ట్యూబ్‌లో వీక్షించేశారు. అలా అదో రికార్డయిపోయి కూర్చుందిప్పుడు.

 

నిజానికి 'డియర్‌ కామ్రేడ్‌'కి తెలుగు రాష్ట్రాల్లో అంతగా ఆదరణ దక్కలేదు. అలాంటిది హిందీలో ఈ రేంజ్‌ పాపులారిటీ దక్కుతుండడంతో ఆశ్చర్యపోవడమే అందరి వంతవుతోంది. ఎప్పటి నుండో మనోడికి బాలీవుడ్‌పై కన్నుంది. ఆ నేపథ్యంలో కొందరు బాలీవుడ్‌ నిర్మాతల్ని కూడా బాగానే హోల్డ్‌లో పెట్టి ఉంచాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు విజయ్‌ నటిస్తున్న 'ఫైటర్‌' నిర్మాణంలో బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ భాగస్వామ్యం పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్‌గా 'డియర్‌ కామ్రేడ్‌' హిందీ వెర్షన్‌ ఎఫెక్ట్‌ చూస్తుంటే, 'ఫైటర్‌'కి అక్కడ తిరుగే ఉండదనిపిస్తోంది.

 

టోటల్‌గా ఈ తతంగం చూస్తుంటే, విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌ ఎంట్రీ ఘనంగానే జరిగేలా కనిపిస్తోంది. ఇక 'ఫైటర్‌' విషయానికి వస్తే, ఇటీవలే ముంబయ్‌లో ఈ సినిమా లాంఛనంగా స్టార్ట్‌ అయ్యింది. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS