నో గ్లామర్‌ అంటూనే చెలామణీ అవుతోందిగా!

మరిన్ని వార్తలు

టాలెంట్‌కి గ్లామర్‌తో పని లేదు.. అని కొంతమంది ముద్దుగుమ్మలు నిరూపిస్తుంటారు. ఆ క్రమంలో తెలుగమ్మాయ్‌ ఐశ్వర్యా రాజేష్‌ పేరు కూడా నిలుస్తుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఐశ్వర్యా రాజేష్‌ కెరీర్‌ బాగానే నడుస్తోంది. గతేడాది 'శైలజా కృష్ణమూర్తి' అంటూ హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి, విమర్శకుల మెప్పు పొందింది. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాలో వన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌గా నటిస్తోంది. గ్లామర్‌కి ఎక్కడా స్కోప్‌ ఇవ్వని పాత్రల్లోనే ఐశ్వర్య కనిపిస్తుంటుంది.

 

ఇంతవరకూ విడుదలైన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌లో ఐశ్వర్య ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించింది. బహుశా విజయ్‌ దేవరకొండకు భార్య పాత్ర అయ్యుంటుందని భావిస్తున్నారు. ఆ పాత్రకు సినిమాలో మంచి పేరు దక్కుతుందని అంటున్నారు. వీటితో పాటు, ఐశ్వర్య చేతిలో ప్రస్తుతం ఐదారు ప్రాజెక్టుల వరకూ ఉన్నాయి. అన్నింట్లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకునే పాత్రలే ఉంటాయి. ఎప్పటికీ గ్లామర్‌ జోలికి పోనని చెప్పుకునే ఐశ్వర్య, మంచి నటి అనిపించుకోవడంలోనే అసలు సిసలు సంతృప్తి ఉందని చెబుతోంది. ఐశ్వర్య నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఐశ్వర్యతో పాటు, రాశీఖన్నా, ఇసాబెల్లె, కేథరీన్‌లు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్‌ దర్శకుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS