అర్జున్ రెడ్డి మూవీ ఫేం విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక తెలుగు ఇండస్ట్రీ లో ఒక సెన్సేషన్. అలాంటి ఈ హీరో ఇప్పుడు ఒక సంచలనాత్మక దర్శకుడితో సినిమా చేయనున్నాడు.
వివరాల్లోకి వెళితే, విజయ్ దేవరకొండ్ తన తరువాత చిత్రం దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే కథా చర్చలు ముగిసినట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం దేవా కట్టా చేస్తున్న చిత్రం అలాగే విజయ్ ఇంతకముందు ఒప్పుకున్నా సినిమాలు పూర్తవ్వగానే ఈ చిత్రం మొదలవుతుందట. ఇక తన బోల్డ్ & హార్డ్ నటనతో అందరిని మెప్పించిన విజయ్ కి హార్డ్ హిట్టింగ్ చిత్రాలు తీసే దేవా తోడవ్వడంతో ఈ సినిమా పైన అందరి దృష్టి పడింది.
సినిమా ప్రకటనకే ఇంత క్రేజ్ వస్తే, ఇక సినిమానే విడుదలయ్యే సమయానికి ఎంతటి క్రేజ్ ని ఈ చిత్రం మూటకట్టుకుంటుందో చూడాలి.