కరోనా కల్లోలం నేపథ్యంలో సామాన్యుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎంత చేస్తున్నా, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఎంతలా కృషి చేస్తున్నా.. సామాన్యుల కష్టాలు మాత్రం తీరడంలేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సినీ పరిశ్రమ కూడా తనవంతు సాయం అందిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించిన విషయం విదితమే. ఇక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ విషయానికొస్తే, కొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఓ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేసి, దాని ద్వారా అవసరమైనవారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ‘మిడిల్ క్లాస్ ఫండ్’ పేరుతో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టాడు. తనవంతుగా కొంత మొత్తాన్ని ప్రకటించి, అదనంగా విరాళాల్ని కోరుతున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ హీరో చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమానికి మంచి మద్దతు లభిస్తోంది. విజయ్ 25 లక్షలు తనవంతుగా ఈ ఫండ్ కోసం వెచ్చిస్తే, అదనంగా మరో 25 లక్షల దాకా ఇప్పటికే ఈ ఫండ్‌కి జమకూడటం గమనార్హం. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ‘ఎంసీఎఫ్’కి అభ్యర్థలను వస్తున్నాయి. ఆ అభ్యర్థనల్ని పరిశీలించి, కొందరికి ఇప్పటికే సాయం అందించారు కూడా. వచ్చిన అభ్యర్థనల్ని ఓ టీవ్‌ు నిశితంగా పరిశీలిస్తుంది. ఎవరైతే సాయం కోరుతున్నారో, వారి సమీపంలోనే వున్న కిరాణా స్టోర్ ద్వారా నిత్యావసర సరుకులు (వెయ్యి రూపాయల విలువైనవి) తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గొప్ప ఆలోచన కదా ఇది.!