తమిళ్‌లో 'రౌడీ' మేనియా ఇదీ లెక్కా.!

By iQlikMovies - February 02, 2019 - 13:44 PM IST

మరిన్ని వార్తలు

విజయ్‌ దేవరకొండ ఇమేజ్‌ని తమిళనాడులో కూడా క్యాష్‌ చేసుకుంటున్నారు. 'నోటా' సినిమాతో డైరెక్ట్‌గా తమిళ ఎంట్రీ ఇచ్చాడు విజయ్‌ దేవరకొండ. అక్కడ 'నోటా' బాగానే ఆదరణ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో రెండేళ్ల క్రితం విజయ్‌ దేవరకొండ నటించిన 'ద్వారక' చిత్రాన్ని తమిళంలో ఇప్పుడు డబ్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమాకి తమిళనాడులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

నిజానికి ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. తమిళనాడులో మాత్రం ఇప్పుడీ సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల తెలుగు, తమిళ భాషల్లో విజయ్‌దేవరకొండ క్రేజ్‌ బాగా పెరిగింది. విజయ్‌ దేవరకొండ నటించిన 'అర్జున్‌రెడ్డి' తెలుగులో సంచనల విజయం అందుకోగా, ఈ సినిమాని తమిళంలో 'వర్మ' టైటిల్‌తోనూ, హిందీలో 'కబీర్‌సింగ్‌' పేరుతోనూ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 'ద్వారక' సినిమా విషయానికి వస్తే, 'అర్జున్‌రెడ్డి' అనే పేరు బాగా పాపులర్‌ కావడంతో అదే పేరుతో 'ద్వారక'ను తమిళంలో విడుదల చేస్తున్నారు. 

 

బయ్యర్స్‌ నుండి ఈ సినిమాకి మంచి స్పందన వస్తోందట. నిజానికి ఈ సినిమాని ఎప్పుడో డబ్‌ చేద్దామనుకున్నారట. కానీ ఇప్పుడు టైం సెట్‌ అయ్యింది. చూడాలి మరి ఈ అర్జున్‌రెడ్డి తమిళనాడులో ఏం చేస్తాడో. పూజా జవేరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS