ఓ తెలుగు సినిమా ఇంత అసభ్యకరంగా ఉంటుందనీ, హాస్యాన్ని ఇంత వల్గర్‌గా కూడా చూపించవచ్చుననీ ఓ సినిమా నిరూపించబోతోంది. అదే 'చీకటి గదిలో చితక్కొట్టుడు'. అడల్ట్ హర్రర్ కామెడీ జోనర్ సినిమా ఇది. అడల్ట్ అని చెప్పేశారు కాబట్టి, ఈ సినిమాని 18 ఏళ్ల వయసు పిల్లలు చూడకూడదు. మరి ట్రైలర్ మాటేమిటి.? ట్రైలర్‌కి సెన్సార్ లేదు కదా. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చక్కర్లు కొట్టేస్తోందిది.
అత్యంత జుగుప్సాకరంగా హీరోయిన్ల క్లీవేజ్‌లు చూపించారు. ట్రైలర్ నిండా డబుల్ మీనింగ్‌లే. మిర్చి హేమంత్ చాలా మందికి సుపరిచితుడు. ఇన్నోసెంట్‌గా కనిపిస్తాడు. ఆ ఇన్నోసెంట్ ఫేస్‌తో చాలా వల్గారిటీ చేయించేశారు. వల్గారిటీలోనే అరాచకంగా ఈ ట్రైలర్‌ని చెప్పుకోవాలేమో. ట్రైలరే ఇలా ఉంటే, సినిమా ఇంకెలా ఉంటుందో. తమిళ్‌లో రూపొందిన ఓ సినిమాని తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' పేరుతో తీశారు.ఇలాంటి సినిమాలు బాలీవుడ్‌లో కూడా కొన్ని వచ్చాయి. ఇలాంటి సినిమాలకు వివాదాలు మామూలే. అదే సమయంలో కమర్షియల్‌గానూ వర్కవుట్ అయ్యే అవకాశాలుంటాయి.
సోషల్ మీడియాలో పోర్న్ సినిమాలు అందుబాటులో ఉన్నా, ఈ తరహా వల్గర్, థ్రిల్లర్, కామెడీలకు డిమాండ్ బాగానే ఉండొచ్చు. ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ముందు ముందు ఈ జోనర్ సినిమాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.