‘ఫైటర్‌’ కాదు : పూరీ - విజయ్‌ టైటిల్‌ మారిందోచ్‌!

మరిన్ని వార్తలు

డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌, రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి టైటిల్‌ మారిందనే ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా ఈ కాంబో మూవీకి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్‌ మార్చే యోచనలో పూరీ ఉన్నాడని తెలుస్తోంది. ప్యాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాతో బాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు విజయ్‌ దేవరకొండ.

 

సో అన్ని భాషల్లోనూ సూట్‌ అయ్యేలా ఉంటుందని ‘లైగర్‌’ టైటిల్‌ని అనుకుంటున్నారట. ఇంతకీ ‘లైగర్‌’ అంటే ఏంటనేది చాలా కొద్ది మందికే తెలిసిన పదం. మగ సింహానికీ, ఆడ పులికీ క్రాస్‌ బ్రీడింగ్‌ జరగడం వల్ల పుట్టిన పిల్లని ‘లైగర్‌’ అంటారు. ఇలాంటి టైటిల్‌ని తన సినిమాకి పెట్టడంలో పూరీ ఏదో పెద్ద ప్లానే వేసినట్లు అర్ధమవుతోంది. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఛార్మి, పూరీతో కలిసి బాలీవుడ్‌ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటి అనన్యా పాండేని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఇటీవలే ముంబైలో షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఈ సినిమాకి సంబంధించి ఓ లేటెస్ట్‌ అప్‌డేట్‌ త్వరలో రిలీజ్‌ చేసేందుకు పూరీ అండ్‌ టీవ్‌ు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS