రౌడీ' బ్రాండ్‌లో బన్నీకి స్పెషల్‌ గిఫ్ట్‌.!

మరిన్ని వార్తలు

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ ఆన్‌ లైన్‌ బిజినెస్‌ గురించి తెలిసిన సంగతే. 'రౌడీ' బ్రాండ్‌ పేరుతో ఆయన ఓ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. యూత్‌లో ఈ బ్రాండ్‌కి పిచ్చ పిచ్చగా క్రేజ్‌ ఉంది. అసలు సంగతేంటంటే, రౌడీ బ్రాండ్‌లో డిజైన్‌ చేసిన ఓ డిఫరెంట్‌ డ్రస్‌ ఒకటి బన్నీకి గిఫ్ట్‌గా వచ్చింది. ఈ డ్రస్‌ ఎవరు పంపించారా.? అని బన్నీ స్టన్‌ అయ్యాడు. ఓపెన్‌ చేస్తే విజయ్‌ దేవరకొండ. స్వయంగా ఆయనే డిజైన్‌ చేసిన దుస్తులవి. బన్నీపై అభిమానంతో సొంతంగా విజయ్‌ దేవరకొండ స్పెషల్‌గా సొంతంగా డిజైన్‌ చేసి మరీ ఆ దుస్తుల్ని స్టైలిష్‌ స్టార్‌ బన్నీకి ఇవ్వడంతో టాలీవుడ్‌లో ఇప్పుడిది హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చి, రేపు రిలీజ్‌ కాబోయే 'అల వైకుంఠపురములో..' సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు మన రౌడీ. ఆ డ్రస్‌ అందుకున్న బన్నీ ట్విట్టర్‌ వేదికగా విజయ్‌కి థాంక్స్‌ చెప్పాడు. బాలీవుడ్‌లో ఈ మధ్య సుదీప్‌, సల్మాన్‌ ఖాన్‌ ఒకరికొకరు గిఫ్ట్స్‌ ఇచ్చుకున్నారు.

 

అయితే, వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించినందుకు వారి మధ్య చిగురించిన స్నేహానికి గుర్తుగా అలా బహుమతులిచ్చుకున్నారు. కానీ, విజయ్‌ దేవరకొండ, బన్నీకి గిఫ్ట్‌ పంపి, మరీ సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పడం విశేషం. ఫిబ్రవరిలో విజయ్‌ దేవరకొండ నటించిన 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సమయంలో మరి బన్నీ కూడా విజయ్‌ కోసం ఏదో ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్‌ చేస్తాడేమో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS