టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీలో ఓ చిన్న రోల్ తో ఎంట్రీ ఇచ్చాడు సెన్సేషనల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ. వినూత్న చిత్రంగా వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' విజయ్ దేవరకొండ సినీ కెరీర్ కి పునాది అయింది. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి'.. చిన్న చిత్రాలుగా రిలీజ్ అయి, ఎవరూ ఊహించని విధంగా సంచలనాత్మక విజయాలనే అందుకున్నాయి . ఆ విజయాలకి తగ్గట్లుగానే ఆ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అనిపించుకున్నాడు. పైగా ఆ స్టార్ స్టేటస్ ను ఈ హీరో ఓ రేంజ్ కి తీసుకువెళ్లగలిగాడు. అందుకే పూరి లాంటి దర్శకుడు కూడా విజయ్ దేవరకొండతో సినిమా చెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ డైరెక్టర్స్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ లు ఇస్తున్నాడు. యువ దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి మొత్తానికి హిట్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కి బాగానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా 'విజయ్ దేవరకొండ'తో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం. అయితే ఈ సినిమా ఓ ఆసక్తికరమైన ఫారెన్ లో పెరిగిన ఓ ఎన్నారై యువకుడు మారుమూల పల్లెటూరులో బతకాల్సి వస్తోందట. ఆ క్రమంలో హీరో ఎదురుకునే సమస్యలు, సంఘటనలు చాల ఆసక్తికరంగా ఉంటాయట.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి చిత్రంతో, అదేవిధంగా దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక శ్రీ హర్ష కోనుగంటి సినిమా మొదలవుతుందట. మరి మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈ యంగ్ డైరెక్టర్ రెండో సినిమాతో కూడా సక్సెస్ కొడతాడా..? అయితే స్క్రిప్ట్ మాత్రం బాగా వచ్చిందని తెలుస్తోంది.